Monday 10 September 2012

శాంతివనం ఉపాధ్యాయ పురస్కారాలు - 2012


శాంతివనం వారు ప్రకాశం జిల్లాలో  పది ఉత్తమ పాఠశాలలను, ఎనభ్బైఏడు మంది మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వారితో సమావేశం ఏర్పాటుచేసి, వారిని అభినందిచారు. ఈ కార్యక్రమం ఒంగోలు లోని మెడికల్ అసోసియేషన్ హాలులో 8-09-2012న జరిగింది. శాంతివనం అధ్యక్షులు కొర్రపాటి సుధాకర్ గారికి, కార్యదర్శి మంచికంటి వెంకటేశ్వరరెడ్డి గారికి ఉపాధ్యాయులందరి తరుపున  కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
కొన్ని ఫోటోలను కింద చూడవచ్చు.




మంచి ఉపాధ్యాయుడు, స్నేహశీలి, చిత్రకారుడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, దైవాలరావూరు ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎనికపాటి కరుణాకర్


కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు గారు , అవార్డు అందచేస్తున్న ఆర్ వి యమ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రామశేషు గారు, జిల్లా సివిల్ కోర్టు సీనియర్ జడ్జ్ హారతి గారు, శాంతివనం అధ్యక్షులు సుధాకర్ గారు.


కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు


చక్కని కృత్యాలతో పిల్లలలో పఠనాసక్తిని పెంచే మంచి ఉపాధ్యాయని శ్యామల గారు, జార్లపాలెం, అద్దంకి.


సైన్స్ ప్రాజెక్ట్ లతో విద్యార్ధులలో స్ఫుర్తి ని నింపే దోర్నాల టీచర్ నాగమూర్తి గారు 


చక్కని తెలుగు పండితులు ప్రసాద్ గారు 


మంచి పాటలు, నాటకాలతో పిల్లలలో చదువు పట్ల ప్రేరణ కలిగించే ఉత్తమ ఉపాధ్యాయులు డి. ఆర్. ప్రసాద్ రెడ్డి గారు, సి,యస్. పురం.


వెలిగండ్ల మండల విద్యాధికారి, ఉత్తమ ఫలితాలకై తపించే ప్రధానోపాధ్యాయులు శివరామకృష్ణ గారు


వృత్తి నిబధ్దతతో నిరంతరం శ్రమించే మహ్మదాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు


సాంఘీక శాస్థ్ర భోదనను కొత్తపుంతలు తొక్కించిన కొత్తపట్నం టీచర్ శివరామకృష్ణగారు


మంచి ఉపాధ్యాయులు, మిత్రులు రవీంద్రారెడ్డి గారు


ఒకటవ తరగతి  పిల్లలకి వాక్యపద్దతిలో భోధిస్తూ, మూడు నెలలలోనే వారిచే కథలను చదివిచే స్థాయిలోనిలుపుతూ
అందుకోసం నిరంతరం శ్రమిస్తూ, అనుక్షణం పిల్లలకై తపన పడే హనుమంతునిపాడు, నారాయపల్లి ఉపాధ్యాయుడు కె.వి. రమణారెడ్డి గారు.


ప్రాథమిక స్థాయిలో గణితం, ఆంగ్లము బోధనలో విన్నూత్న పద్దతులను అవలంభించే హనుమంతునిపాడు మండలం,మిట్టపాలెం ఉపాధ్యాయుడు ఆదినారాయణ గారు.


మంచి ఉపాధ్యాయులు వెలిగండ్ల మండలం, కంకణం పాడు టీచర్ బషీర్



మొగల్లూరు టీచర్, పాఠశాల అభివృధ్దకై సర్వదా శ్రమించే నాగూర్ షరీఫ్ గారు.

ఆదినారాయణ, సుధాకర్,రమణారెడ్డి,భాస్కర్,వెంకటేశ్వరరెడ్డి.


No comments:

Post a Comment