Monday, 8 October 2012

గాంధీ విగ్రహ ఆవిష్కరణ

పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పి,
నిండుతనాన్ని తెచ్చిన, గొప్ప మనసున్న దాతలు
కమ్మవారపల్లె గ్రామ వాస్తవ్యులు
శ్రీ గుంటూరి అక్కయ్య గారు
( మాజీ సర్పంచ్, దిరిశవంచ పంచాయితీ)
 మరియు వారి కుమారులు
శ్రీ గుంటూరి నాగేశ్వరరావు గారు
శ్రీ గుంటూరి మల్లిఖార్జన (అమెరికా) గారు
శ్రీ గుంటూరి సుబ్బారావు గారు








Wednesday, 26 September 2012

ఉపాధ్యాయ దినోత్సవం ఫోటోలు


మన బళ్ళో రాధాకృష్ణన్ జన్మదినం



బర్త్ డే కేక్  కొవ్వొత్తులు ఊదుతున్న పదవ తరగతి విద్యార్థినులు శాంతి, పార్వతి 


ప్రసంగాల శ్రద్ధగా వింటున్న విద్యార్థులు


సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు రమేష్ గారిని సన్మానిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు 



గణిత ఉపాధ్యాయులు సాబీర్ గారిని సన్మానిస్తున్న విద్యార్థనీ విద్యార్థలు

ఈ కార్యక్రమానికి గాంధీ విగ్రహదాత శ్రీ గుంటూరి అక్కయ్యగారు హాజరైనారు.

Monday, 17 September 2012

విద్యార్థినులు ఆలాపన




 " తేనెల తేటల మాటలతో "  అంటూ మా పాఠశాల విద్యార్థినులు  ఆలాపించిన గీతం వీడియో  ఇది. 
  ఓ చిన్న ప్రయత్నం చేశాను, ఇలా కొన్ని మంచి పాటలను చిత్రీకరించి , కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన
శ్రీ గుంటూరి భాస్కర రావు గారు మా పాఠశాలకు బహుకరించిన ప్రోజెక్టర్ సహాయంతో  చుట్టుపక్కల గ్రామాలలో ప్రదర్శించాలని 
అనుకుంటున్నాము. అక్షరాస్యత, పర్యావరణం, మద్యపానం లాంటి అంశాలతో వారి పిల్లలపై   
చిత్రీకరించిన పాటలు,
తల్లిదండ్రులను కొంత ఆలోచింపచేస్తాయని ఆశ.

Monday, 10 September 2012

శాంతివనం ఉపాధ్యాయ పురస్కారాలు - 2012


శాంతివనం వారు ప్రకాశం జిల్లాలో  పది ఉత్తమ పాఠశాలలను, ఎనభ్బైఏడు మంది మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వారితో సమావేశం ఏర్పాటుచేసి, వారిని అభినందిచారు. ఈ కార్యక్రమం ఒంగోలు లోని మెడికల్ అసోసియేషన్ హాలులో 8-09-2012న జరిగింది. శాంతివనం అధ్యక్షులు కొర్రపాటి సుధాకర్ గారికి, కార్యదర్శి మంచికంటి వెంకటేశ్వరరెడ్డి గారికి ఉపాధ్యాయులందరి తరుపున  కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
కొన్ని ఫోటోలను కింద చూడవచ్చు.




మంచి ఉపాధ్యాయుడు, స్నేహశీలి, చిత్రకారుడు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, దైవాలరావూరు ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎనికపాటి కరుణాకర్


కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్ రావు గారు , అవార్డు అందచేస్తున్న ఆర్ వి యమ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రామశేషు గారు, జిల్లా సివిల్ కోర్టు సీనియర్ జడ్జ్ హారతి గారు, శాంతివనం అధ్యక్షులు సుధాకర్ గారు.


కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు


చక్కని కృత్యాలతో పిల్లలలో పఠనాసక్తిని పెంచే మంచి ఉపాధ్యాయని శ్యామల గారు, జార్లపాలెం, అద్దంకి.


సైన్స్ ప్రాజెక్ట్ లతో విద్యార్ధులలో స్ఫుర్తి ని నింపే దోర్నాల టీచర్ నాగమూర్తి గారు 


చక్కని తెలుగు పండితులు ప్రసాద్ గారు 


మంచి పాటలు, నాటకాలతో పిల్లలలో చదువు పట్ల ప్రేరణ కలిగించే ఉత్తమ ఉపాధ్యాయులు డి. ఆర్. ప్రసాద్ రెడ్డి గారు, సి,యస్. పురం.


వెలిగండ్ల మండల విద్యాధికారి, ఉత్తమ ఫలితాలకై తపించే ప్రధానోపాధ్యాయులు శివరామకృష్ణ గారు


వృత్తి నిబధ్దతతో నిరంతరం శ్రమించే మహ్మదాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు


సాంఘీక శాస్థ్ర భోదనను కొత్తపుంతలు తొక్కించిన కొత్తపట్నం టీచర్ శివరామకృష్ణగారు


మంచి ఉపాధ్యాయులు, మిత్రులు రవీంద్రారెడ్డి గారు


ఒకటవ తరగతి  పిల్లలకి వాక్యపద్దతిలో భోధిస్తూ, మూడు నెలలలోనే వారిచే కథలను చదివిచే స్థాయిలోనిలుపుతూ
అందుకోసం నిరంతరం శ్రమిస్తూ, అనుక్షణం పిల్లలకై తపన పడే హనుమంతునిపాడు, నారాయపల్లి ఉపాధ్యాయుడు కె.వి. రమణారెడ్డి గారు.


ప్రాథమిక స్థాయిలో గణితం, ఆంగ్లము బోధనలో విన్నూత్న పద్దతులను అవలంభించే హనుమంతునిపాడు మండలం,మిట్టపాలెం ఉపాధ్యాయుడు ఆదినారాయణ గారు.


మంచి ఉపాధ్యాయులు వెలిగండ్ల మండలం, కంకణం పాడు టీచర్ బషీర్



మొగల్లూరు టీచర్, పాఠశాల అభివృధ్దకై సర్వదా శ్రమించే నాగూర్ షరీఫ్ గారు.

ఆదినారాయణ, సుధాకర్,రమణారెడ్డి,భాస్కర్,వెంకటేశ్వరరెడ్డి.


Sunday, 19 August 2012

dirisavancha , school zone.






దిరిశవంచ ఉన్నత పాఠశాల, ఆరు మండలాల 
పాఠశాలల ఆటల పోటీలు 2011-2012 సంవత్సరం నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియో ఇది.

Saturday, 21 April 2012

inspire award photos


 గుంటూరు లో జరిగిన రాష్ట్ర స్థాయు ఇన్ స్పయి ర్ పోటీలలో పాల్గొన్న 
దిరిసవంచ పాటశాల విద్యార్ధులు రామకృష్ణ ,రమేష్ ,రామకృష్ణ 
సైన్సు టీచర్లు కే. సుధాకర్ , భాస్కర్ 

అమరావతి సందర్శించిన మన విద్యార్థులు 


Thursday, 19 April 2012

national science day



ఉపాధ్యాయ దినోత్సవం నాడు పాటశాల  హెడ్మాస్టర్  శ్రీ పూర్ణ చంద్ర రావు ను సన్మానిస్తున్న విద్యార్థులు 





జాతీయ సైన్సు దినోత్సవం నాడు సర్ c.v.raman చిత్ర పటానికి  పూల మాలలు వేసి .
శాస్త్రవేత్తల ఫోటో లతో గ్రామం లో రాలి నిర్వహిస్తున్న విద్యార్థులు 



Thursday, 12 April 2012



దిరిసవంచ  హై స్కూల్ లో శ్రమ దానం చేస్తున్న పిల్లలు 



స్వాతంత్ర్య దినోత్సవం రోజు  బహుమతి ప్రధానం చేస్తున్న పంచాయతి సెక్రటరీ మాచవరం ప్రసాద్ రావు గారు 




స్వాతంత్ర్య దినోత్సవం రోజు  బహుమతి ప్రధానం చేస్తున్న పంచాయతి మాజి సర్పంచ్  గుంటూరి కాశయ్య గారు 





స్వాతంత్ర్య దినోత్సవం రోజు  బహుమతి ప్రధానం చేస్తున్న పంచాయతి మాజి సర్పంచ్  గుంటూరి అక్కయ్య గారు 






జాతీయ సైన్సు దినోత్సవం నాడు గ్రామం లో పాట పాడుతున్న విద్యార్ధినులు 

Thursday, 2 February 2012

బడి


బడి అంటే యంత్రం కాదు 
అది తరతరాల శోధిక 
బడి అంటే మంత్రం కాదు 
అది భవిషత్కాల గీతిక
బడి అంటే భవనం కాదు 
అది అది .............
జ్ఞానకాంతుల దీపిక 
మానవత్వపు మాలిక 
విజ్ఞానపు వేదిక 

                                               children coming to the school
Z.P.HIGH SCHOOL
DIRISAVANCHA
PRAKASAM DISTRICT
ANDHRA PREDESH
INDIA